Stock Market Today: ఒడుదొడుకుల ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 12 పాయింట్లు తగ్గి.. 57,794 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ- నిఫ్టీ 10 పాయింట్ల అతిస్వల్ప నష్టంతో.. 17,204 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.
గురువారం సెషన్లో ఐటీ షేర్లు రాణించిగా.. ఆయిల్ & గ్యాస్, పవర్, రియాల్టీ, లోహ షేర్లు 1 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు ఫ్లాట్ ట్రేడయ్యాయి.
ఇంట్రాడే సాగిందిలా..
ఇంట్రాడేలో సెన్సెక్స్ ముప్పై షేర్లలో 15 షేర్లు డీలా పడ్డాయి.
సెన్సెక్స్ ఉదయం 57,755 వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. ఆద్యంతం ఊగిసలాడిన సూచీ.. ఇంట్రాడేలో 58,010 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని.. 57,579 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది.
మరో సూచీ నిఫ్టీ ఇంట్రాడేలో 17,146 వద్ద కనిష్ఠస్థాయి.. 17,264 పాయింట్ల గరిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివివే..
ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్‌టెక్, ఇండస్ఇండ్ బ్యాంకు, టైటాన్, విప్రో, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, హిందూస్థాన్‌యూనిలీవర్, భారతీఎయిర్‌టెల్ ఎక్కువగా లాభపడ్డాయి.
రిలయన్స్, టాటా స్టీల్, మారుతి, బజాజ్ఫిన్సెర్వ్, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, నెస్లే, ఎం అండ్ ఎం షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.
ఒడుదొడుకులకు కారణాలివే..
- అంతర్జాతీయంగా మిశ్రమ పరిస్థితులు, దేశీయంగా ఒమిక్రాన్, కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు.
- డిసెంబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండగా.. మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య ట్రేడయ్యాయి.
- రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, లోహ రంగాల అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణమైంది.
ఇదీ చూడండి:ఈపీఎఫ్ ఈ-నామినేషన్ గడువు పొడిగింపు.. కానీ..