తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుస నష్టాలకు బ్రేక్​- 12 వేలకు ఎగువకు నిఫ్టీ

స్టాక్​ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 428 పాయింట్లు, నిఫ్టీ 133 పాయింట్లు వృద్ధి చెందాయి. కరోనా కొత్త కేసులు తగ్గడం, భారత్​లో వైరస్​ ప్రభావాన్ని ఎదుర్కోవడంపై పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి భరోసా ఇవ్వడం లాభాలకు కారణం.

stock
స్టాక్ మార్కెట్లు

By

Published : Feb 19, 2020, 3:46 PM IST

Updated : Mar 1, 2020, 8:36 PM IST

స్టాక్​ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్​ పడింది. కరోనా మరణాల రేటు తగ్గుతున్న క్రమంలో ఆసియా మార్కెట్లు సానుకూలంగా స్పందించటం కలిసొచ్చింది. ఫలితంగా దేశీయ మార్కెట్లు ఉదయం నుంచి పరుగులు పెట్టాయి.

బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్​ 428 పాయింట్లు లాభపడి 41,323కు చేరుకుంది. 133 పాయింట్లు వృద్ధి చెందిన జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 12,125 పాయింట్ల వద్ద స్థిరపడింది.

తొలగిన కరోనా భయాలు..

కొత్త కరోనా వైరస్​ కేసుల తగ్గుదలతో మదుపరుల సెంటిమెంటు బలపడింది. ఆర్థిక వ్యవస్థపై వైరస్​ ప్రభావాన్ని నియంత్రించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు పరిశ్రమ వర్గాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ మంగళవారం భేటీ అయ్యారు. త్వరలోనే పరిష్కార మార్గాలపై నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి ప్రకటనతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి.

లాభ నష్టాల్లో..

కోల్​ ఇండియా, హిందుస్థాన్​ యూనిలీవర్​, భారతి ఇన్​ఫ్రాటెల్​, బజాజ్​ ఫినాన్స్​, రిలయన్స్​, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ లాభాల్లో సాగాయి.

టాటా మోటార్స్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, సన్​ ఫార్మా, భారతీ ఎయిర్​టెల్​, టీసీఎస్​ నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.

Last Updated : Mar 1, 2020, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details