అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) తాజా అంచనాల్లో భారత వృద్ధి రేటును తగ్గించిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ -సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోయి 41,478 గా కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ -నిఫ్టీ 10 పాయింట్ల క్షీణతతో 12,215 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో ఉన్న షేర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ, హెచ్సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో ఉన్న షేర్లు
హెచ్డీఎఫ్సీ ట్విన్స్, కోటక్ బ్యాంక్, ఐటీసీ, టాటా స్టీల్, హీరో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ