Stock Market: స్టాక్ మార్కెట్లపై బేర్ విరుచుకుపడింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతలతో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు.. చివరకు భారీ నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 581 పాయింట్లు పతనమై.. 57,276 వద్ద ముగిసింది. మరో సూచి జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 168 పాయింట్లు కోల్పోయి..17,110 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ ఉదయం 57,317 పాయింట్లు వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో మరింత నష్టాల్లో కూరుకుపోయింది. ఒక దశలో 56,439 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్ల దన్నుతో కోలుకుంది. రోజులో 1,069 పాయింట్లు మధ్య కదలాడిన సూచీ.. మరో దశలో 57,508 వద్ద గరిష్ఠాన్నికి చేరింది.
మరో సూచీ ఎన్ఎస్ఈ-నిఫ్టీ 17,062 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 16,866 వద్ద కనిష్ఠాన్ని తాకి.. 17,182 పాయింట్ల గరిష్ఠాన్ని చేరింది.
లాభానష్టాల్లోనివి ఇవే..
- 30 షేర్ల సూచీలో ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐఎన్, మారుతి, కొటక్బ్యాంకు, ఇండస్ఇండ్బ్యాంకు, సన్‌ఫార్మా, ఎం అండ్ ఎం, అల్ట్రాటెక్సిమెంట్, ఐటీసీ మాత్రమే లాభాలు గడించాయి.
- హిచ్సీఎల్టెక్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, విప్రో, టైటాన్, ఇన్ఫోసిస్, నెస్లే, పవర్‌గ్రిడ్, టాటాస్టీల్, బజాజ్ ఫిన్ సెర్వ్ ప్రధానంగా నష్టపోయాయి.