Share Market News Today: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం సెషన్‌ను నష్టాలతో ముగించాయి. ప్రారంభంలో భారీ నష్టాలను చవి చూసిన మార్కెట్లు మిడ్ సెషన్ నాటికి కాస్త కోలుకున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్ 427 పాయింట్లు కోల్పోయి 59,037 వద్ద సెషన్‌ను ముగించింది. మరో సూచీ నిఫ్టీ 139 పాయింట్లు క్షీణించి 17,617 వద్ద స్థిరపడింది.
కారణాలివే...
- ఒమిక్రాన్ నేపథ్యంలో అమెరికాలో నిరుద్యోగం మూడు నెలల గరిష్ఠానికి చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గ్లోబల్ సూచీలు దిద్దుబాటుకు గురువుతున్న సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు. దీనికి తోడు చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ భయాలు మదుపర్లను కలవరపెట్టాయి.
- ఫెడ్ వడ్డీరేట్ల పెంపు నిర్ణయం కూడా సూచీలను ప్రభావితం చేసింది.
- రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదంపైనా మదుపర్లు దృష్టిసారించారు. అమెరికాలో తయారైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు పంపడానికి బాల్టిక్ దేశాలకు అగ్రరాజ్యం అనుమతినివ్వడం ఆందోళన కలిగిస్తోంది.
- దేశీయంగా చూస్తే విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు ఈ రోజు కూడా కొనసాగాయి. దీంతో సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.
- దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి తర్వాత కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. కేసుల సంఖ్య గురువారం మూడు లక్షలు దాటడం మదుపర్లను ప్రభావితం చేసింది.
ఇంట్రాడే సాగిందిలా..
- సెన్సెక్స్ 59,329 పాయింట్ల అత్యధిక స్థాయి, 58,620 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
- నిఫ్టీ 17,707 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,485 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..