స్టాక్ మార్కెట్లు (Stock Market) బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex Today) 329 పాయింట్లు తగ్గి 57,788వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty Today) 115 పాయింట్ల నష్టంతో 17,210కు చేరింది.
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సహా.. అంతర్జాతీయ మిశ్రమ పవనాల నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాలతో సెషన్‌ను ముగించినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 58,218 పాయింట్ల అత్యధిక స్థాయి, 57,671 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.