తెలంగాణ

telangana

ETV Bharat / business

వ్యాక్సినేషన్​పై ఆశలు- మార్కెట్లకు లాభాలు - ఎన్​ఎస్​ఈ

స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 92 పాయింట్ల లాభపడింది. నిఫ్టీ 31 పాయింట్లు పెరిగింది.

STOCKS CLOSE
స్టాక్ మార్కెట్లు

By

Published : Jan 14, 2021, 3:46 PM IST

Updated : Jan 14, 2021, 4:13 PM IST

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 92 పాయింట్లు పెరిగి 49,584 వద్దకు చేరింది. నిఫ్టీ 31 పాయింట్ల స్వల్ప లాభంతో 14,595 వద్ద స్థిరపడింది.

దేశవ్యాప్తంగా ఈ నెల 16న టీకా పంపిణీ ప్రారంభం కానుండటం మదుపరుల్లో సానుకూలతలు పెంచింది. ఫలితంగా జరిపిన కొనుగోళ్లతో మార్కెట్లు లాభాలు నమోదుచేశాయి.

ఇంట్రాడేలో..

సెన్సెక్స్ 49,663 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఒక దశలో 49,182 పాయింట్ల కనిష్టాన్ని తాకింది.

నిఫ్టీ 14,471 పాయింట్ల అత్యల్ప స్థాయిని తాకి, 14,617 పాయింట్ల అత్యధిక స్థాయికి చేరింది.

లాభనష్టాలు ఇలా..

ఇండస్​ఇండ్ బ్యాంక్, టీసీఎస్​, ఎల్​&టీ, ఐటీసీ, హెచ్​యూఎల్​, రిలయన్స్ ఇండస్ట్రీస్, షేర్లు లాభాలు గడించాయి.

హెచ్​సీఎల్​ టెక్, యాక్సిస్​ బ్యాంక్, ఏషియన్​ పెయింట్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్​ సిమెంట్, టెక్​ మహీంద్రా, షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

Last Updated : Jan 14, 2021, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details