తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయంగా మిశ్రమపవనాలు.. నష్టాల్లో మార్కెట్లు - స్టాక్​ మార్కెట్​

stock market live
స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

By

Published : Mar 21, 2022, 9:25 AM IST

Updated : Mar 21, 2022, 11:31 AM IST

11:24 March 21

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఊగిసలాటలో పయనిస్తున్నాయి. తొలుత లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. తిరిగి పుంజుకున్నప్పటికీ.. గరిష్ఠాల వద్ద కొనుగోళ్ల ఒత్తిడి ఎదురవుతోంది.

ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మరోసారి చమురు ధరలు పెరుగుతుండడం దేశీయ మదుపర్లను కలవరపెడుతోంది. గతవారం 99 డాలర్ల వద్ద ఉన్న బ్యారెల్‌ చమురు ధర ఇప్పుడు 110 డాలర్లకు చేరింది. దీంతో పాటు స్వల్పకాలంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు, పలు దేశాల్లో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ల విధింపు వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సూచీలు నష్టాలను ఎదుర్కొవాల్సి వస్తోంది.

బీఎస్​ఈ సెన్సెక్స్​ 92 పాయిట్ల నష్టంతో 57,771 వద్ద కొనసాగుతోంది. మరో సూచీ నిఫ్టీ 23 పాయింట్లు కోల్పోయి 17,263 వద్ద ట్రేడవుతుంది.

09:01 March 21

స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

stock market live updates: అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పవనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 78 పాయిట్ల నష్టంతో 57,785 వద్ద కొనసాగుతోంది. మరో సూచీ నిఫ్టీ 16 పాయింట్లు కోల్పోయి 17,270 వద్ద ట్రేడవుతుంది.

లాభనష్టాలు..

మారుతీ, విప్రో, టాటా స్టీల్​, ఇన్ఫోసిస్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఏసియన్​ పెయింట్స్​, ఎం అండ్​ ఎం, కోటక్​ మహీంద్రా బ్యాంక్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ షేర్లు నష్టాల బాట పట్టాయి.

Last Updated : Mar 21, 2022, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details