Stock Market Live: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ- సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 55,759 వద్ద ట్రేడవుతోంది.
మరో సూచీ జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ- నిఫ్టీ సైతం లాభాల్లోనే ఉంది. 300 పాయింట్లకుపైగా పెరిగి.. 16 వేల 668 వద్ద కొనసాగుతోంది.
30 షేర్ల సూచీలో దాదాపు అన్ని షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
లాభాలకు కారణాలివే..
అంతర్జాతీయంగా సానుకూల పవనాలతో మార్కెట్లు.. పుంజుకుంటున్నాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం సహా ఆసియా మార్కెట్లు సైతం సానుకూలంగా ట్రేడవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యా చమురు, సహజ వాయువు, బొగ్గు దిగుమతులపై నిషేధం విధించిన తర్వాత అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఉక్రెయిన్, రష్యా దౌత్యపరమైన చర్చలను పునఃప్రారంభించగా.. చమురు ధరలు 12శాతం పైగా తగ్గాయి. దీనికి తోడు చమురు ఉత్పత్తిని పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు యూఈఏ పేర్కొంది. ఈ తాజా పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.
ముఖ్యంగా మినీ సార్వత్రిక ఎన్నికలుగా భావిస్తున్న.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మదపర్లు దృష్టిసారిస్తున్నారు.