సూచీల కుదేలు..
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. మండుతున్న చమురు ధరలు.. ఫలితంగా అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఉదయం నుంచి భారీగా పతనమవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్ల నష్టంతో.. 55 వేల 40 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ దాదాపు 300 పాయింట్లు కోల్పోయి.. 16 వేల 485 వద్ద ఉంది.
లాభనష్టాల్లో..
యుద్ధం జరుగుతున్నా.. కోల్ ఇండియా, హిందాల్కో, టాటా స్టీల్ మాత్రం 5 శాతానికిపైగా పెరిగాయి. ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ 4 శాతం చొప్పున లాభపడ్డాయి.
మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డీలాపడ్డాయి.
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో ఐదు షేర్లు మినహా అన్నీ నష్టాల్లోనే ఉండటం గమనార్హం.