Stock Market Close: రికార్డు స్థాయి నష్టాల అనంతరం స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నా.. దేశీయ సూచీలు తేరుకోవడం విశేషం.
సెన్సెక్స్ 1329, నిఫ్టీ 410 పాయింట్ల మేర లాభపడ్డాయి. క్రితం సెషన్లో సెన్సెక్స్ 2700 పాయింట్లు పతనం కావడం గమనార్హం.