తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆఖర్లో ఢమాల్​.. సెన్సెక్స్​ 69, నిఫ్టీ 29 పాయింట్లు మైనస్​

STOCK MARKET LIVE UPDATES
STOCK MARKET LIVE UPDATES

By

Published : Feb 23, 2022, 9:24 AM IST

Updated : Feb 23, 2022, 3:42 PM IST

15:41 February 23

ఆఖర్లో ఢమాల్​..

Stock Market Close: రష్యా- ఉక్రెయిన్​ ఉద్రిక్త పరిస్థితులు స్టాక్​ మార్కెట్లను తీవ్ర ఒడుదొడుకులకు గురిచేస్తున్నాయి. దేశీయ సూచీలు రోజంతా మంచి లాభాల్లోనే ఉన్నా.. ఆఖర్లో మళ్లీ నేలచూపులు చూశాయి. సెన్సెక్స్​ 69, నిఫ్టీ 29 పాయింట్లు పడిపోయాయి.

11:28 February 23

అంతర్జాతీయంగా యుద్ధ భయాలు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 360 పాయింట్లకు పైగా ట్రేడవుతోంది. 57,660 వద్ద కదలాడుతోంది.

వంద పాయింట్లకు పైగా లాభపడిన నిఫ్టీ.. 17,195 వద్ద ట్రేడవుతోంది.

ఉక్రెయిన్​పై రష్యా దండెత్తనుందనే భయాలు నెలకొన్నప్పటికీ.. మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండటం విశేషం. ఆసియా మార్కెట్లు సైతం స్థిరంగా ట్రేడవుతున్నాయి. రష్యాపై జపాన్, అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షలు ఇందుకు కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంక్షల వల్ల యుద్ధంపై రష్యా వెనక్కి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

08:52 February 23

స్టాక్ మార్కెట్ లైవ్ అప్​డేట్స్

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300కు పైగా పాయింట్లతో ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం 292 పాయింట్లు ఎగబాకి 57,592 వద్ద కదలాడుతోంది.

నిఫ్టీ సైతం లాభాల్లోనే ఉంది. 94 పాయింట్లు వృద్ధి చెంది.. 17,186 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్ 30 షేర్లలో దాదాపు అన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు రాణిస్తున్నాయి.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధ భయాలు నెలకొన్నా మార్కెట్లు రాణిస్తుండటం విశేషం. కొద్దిరోజులుగా భారీగా పతనమైన షేర్లను కొనుగోలు చేసేందుకు మదుపర్లు మొగ్గుచూపడం వల్ల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.

Last Updated : Feb 23, 2022, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details