తెలంగాణ

telangana

ETV Bharat / business

వారాంతపు సెషన్​లోనూ ఒడుదొడుకులే.. సెన్సెక్స్​ 59 మైనస్​

stock market live updates
ఒడుదొడుకుల్లో సూచీలు

By

Published : Feb 18, 2022, 9:35 AM IST

Updated : Feb 18, 2022, 3:41 PM IST

15:39 February 18

మళ్లీ నష్టాలే..

వరుసగా మూడో సెషన్​లో మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్​ 59, నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయాయి.

బ్యాంకింగ్​ షేర్లు లాభపడగా.. ఫార్మా, రియాల్టీ, ఆయిల్​ అండ్​ గ్యాస్​ రంగం తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది.

10:56 February 18

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. కాసేపటికే కోలుకొని స్వల్ప లాభాల్లోకి ఎగబాకినప్పటికీ ఎక్కువసేపు నిలబడలేకపోయాయి. గురువారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఆ ప్రభావం నేడు ఆసియా మార్కెట్లపైనా పడింది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి రావడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి రష్యా ఇంకా బలగాల్ని వెనక్కి పంపలేదని.. పైగా మరింత ఎక్కువ మందిని మోహరించిందన్న అమెరికా ప్రకటన అక్కడి సూచీలను కలవరపెట్టింది. అయితే, ఈ విషయంపై రష్యాతో చర్చలు జరుపుతామని మార్కెట్లు ముగిసిన తర్వాత యూఎస్‌ ప్రకటించింది. ఈ పరిణామాలతో నేడు మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి.

సెన్సెక్స్.. ప్రస్తుతం 22 పాయింట్లు వృద్ధి చెందింది. 57,914 వద్ద కదలాడుతోంది.

నిఫ్టీ 1 పాయింటు ఎగబాకి.. ప్రస్తుతం 17,304 వద్ద ట్రేడవుతోంది.

లాభానష్టాలు..

ఎల్​ అండ్​ టీ, టాటా స్టీల్​, పవర్​ గ్రిడ్​, మారుతీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నెస్లే, ఇన్ఫోసిస్​, టెక్​ మహీంద్రా, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:04 February 18

స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్

స్టాక్​ మార్కెట్లు శుక్రవారం సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 32 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 57,859 వద్ద ట్రేడవుతోంది.

మరో సూచీ నిఫ్టి 5 పాయింట్ల కోల్పోయి 17,299 వద్ద కదిలాడుతోంది.

Last Updated : Feb 18, 2022, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details