తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుసగా రెండో సెషన్​లో మార్కెట్లు కిందికే.. సెన్సెక్స్​ 105 మైనస్​ - స్టాక్ మార్కెట్ లైవ్ అప్​డేట్స్

STOCK MARKET LIVE UPDATES
స్టాక్ మార్కెట్ లైవ్ అప్​డేట్స్

By

Published : Feb 17, 2022, 9:32 AM IST

Updated : Feb 17, 2022, 3:42 PM IST

15:38 February 17

మళ్లీ నష్టాలే..

తీవ్ర ఒడుదొడుకుల ట్రేడింగ్​లో స్టాక్​ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్​ 105 పాయింట్లు కోల్పోయి..57 వేల 892 వద్ద సెషన్​ను ముగించింది.

నిఫ్టీ 18 పాయింట్ల పతనమంతో.. 17 వేల 305 వద్ద స్థిరపడింది.

బ్యాంకింగ్​ షేర్లు దారణంగా నిరాశపర్చగా.. విద్యుత్​ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి.

11:33 February 17

స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. తీవ్ర ఒడుదొడుకుల మధ్య ట్రేడవుతున్న సెన్సెక్స్.. ప్రస్తుతం 128 పాయింట్లు వృద్ధి చెందింది. 58,125 వద్ద కదలాడుతోంది.

నిఫ్టీ 56 పాయింట్లు ఎగబాకింది. ప్రస్తుతం 17,378 వద్ద ట్రేడవుతోంది.

10:08 February 17

స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. సూచీలు ఒడుదొడుకుల మధ్యే ట్రేడింగ్ సాగిస్తున్నాయి. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. క్రమంగా నష్టాల్లోకి మళ్లింది. ప్రస్తుతం 120 పాయింట్లు కోల్పోయి.. 58 వేల మార్క్ దిగువన ట్రేడవుతోంది.

నిఫ్టీ సైతం నష్టాల్లోనే ఉంది. 15 పాయింట్లు పడిపోయి.. 17,306 వద్ద కదలాడుతోంది.

ఆసియా మార్కెట్లు సైతం ఒడుదొడుకుల్లోనే ఉన్నాయి. ఉక్రెయిన్​పై దాడి చేయాలన్న ప్రణాళికలను రష్యా విరమించుకోలేదని అమెరికా చేసిన ప్రకటనతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు, క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 93.99 డాలర్లు పలుకుతోంది.

బుధవారం విదేశీ సంస్థాగత మదుపర్లు మూకుమ్మడిగా విక్రయాలకు దిగారు. రూ.1890.96 కోట్ల షేర్లను వారు విక్రయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీ గణాంకాలు చెబుతున్నాయి.

09:17 February 17

స్టాక్ మార్కెట్ లైవ్ అప్​డేట్స్

STOCK MARKET LIVE UPDATES: అంతర్జాతీయంగా మిశ్రమ పవనాలు నెలకొన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 312 పాయింట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం 58,309 వద్ద కదలాడుతోంది.

నిఫ్టీ సైతం లాభాల్లోనే ఉంది. 103 పాయింట్ల లాభంతో 17,425 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Feb 17, 2022, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details