Stock Market Close:మంగళవారం సెషన్లో రికార్డు స్థాయి లాభాల అనంతరం.. స్టాక్ మార్కెట్లు మళ్లీ ఒడుదొడుకులకు లోనయ్యాయి. మిడ్ సెషన్లో భారీ లాభాల్లో ఉన్న సూచీలు.. ఆఖరి గంటలో నష్టాల్లోకి జారుకున్నాయి.
ఇవాళ 150 పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఓ దశలో 400 పాయింట్ల మేర పెరిగి 58 వేల 569 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. 57 వేల 780 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 30 పాయింట్ల పతనంతో.. 17 వేల 322 వద్ద ముగిసింది.