తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock Market: పుంజుకున్న సూచీలు​​- సెన్సెక్స్ 200 ప్లస్

stock market live
stock market live

By

Published : Feb 8, 2022, 9:34 AM IST

Updated : Feb 8, 2022, 3:11 PM IST

15:04 February 08

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం సెషన్​ ప్రారంభం నుంచి ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు.. అనంతరం లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోంది. 57,840 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

అటు నిఫ్టీ సైతం పుంజుకుంది. 70 పాయింట్ల లాభంతో 17,283 వద్దకదలాడుతోంది.

12:33 February 08

తేరుకున్న మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల నుంచి లాభాల బాట పట్టాయి. లోహ, ఫార్మా షేర్ల దన్నుతో సూచీలు తిరిగి పుంజుకున్నాయి. సెన్సెక్స్​ 100 పాయింట్లకుపైగా మెరుగుపడి.. 57,799 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 17,258 వద్ద కదలాడుతోంది.

  • బజాజ్​, టాటాస్టీల్​, ఏషియన్​పెయింట్​, రిలయన్స్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో కొనసాగుతున్నాయి.
  • పవర్​గ్రిడ్​, టీసీఎస్​, ఎల్​ అండ్​ టీ, కోటక్​బ్యాంకు, అల్ట్రాటెక్​సిమెంట్​ ఎక్కువగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:03 February 08

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్​సీ-సెన్సెక్స్​ 500 పాయింట్లకుపైగా పతనమై 57,093 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సైతం.. 150 పాయింట్లకుపైగా కోల్పోయి.. 17,059 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

30 షేర్ల సూచీలో బజాబ్​ఫిన్​సెర్వ్​, బజాబ్​ ఫైనాన్స్​, డాక్టర్​ రెడ్డీస్​, ఏషియన్​పెయింట్​ మినహా మిగతా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాలకు కారణాలివే..!

ఆర్​బీఐ ద్రవ్యపరపతి విదాన సమీక్షా సమావేశం నేడు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్భణాన్ని స్థిరంగా ఉంచేందుకు వడ్డీరేట్లను పెంచుతారు అనే ఊహాగానాలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి. దీంతో అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతుడటం వల్ల మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

10:17 February 08

దేశీయ సూచీలు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. లాభాల్లో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు.. క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్​ 100 పాయింట్లకుపైగా నష్టంతో 57,467 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 31 పాయింట్ల తగ్గి 17,182 వద్ద ట్రేడవుతోంది.

పవర్​, ఐటీ, ప్రభుత్వ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడితో సూచీల నష్టాల్లో జారుకున్నాయి. మరోవైపు ఫార్మా షేర్లు రాణిస్తున్నాయి.

09:15 February 08

స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

stock market: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 100 పాయింట్లకుపైగా లాభంతో.. 57,722 వద్ద కదలాడుతోంది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి.. 17,254 పాయింట్ల వద్ద ట్రేవడుతోంది.

Last Updated : Feb 8, 2022, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details