తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock market: కొనసాగుతున్న బుల్​ జోరు​- సెన్సెక్స్​ 580 ప్లస్​

stock market live updates
స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

By

Published : Feb 2, 2022, 9:23 AM IST

Updated : Feb 2, 2022, 1:14 PM IST

13:02 February 02

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ, ఉద్యోగాల సృష్టికి మద్దతుగా బడ్జెట్‌లో మౌలిక రంగ వ్యయాలను భారీగా పెంచడం, కొత్తగా పన్నులు విధించకపోవడంతో మదుపర్లపై కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలపర్చాయి. దీంతో భారీ లాభాల దిశగా మార్కెట్లు దూసుకెళ్తున్నాయి.

లాభనష్టాలు..

బజాజ్​ ఫినాన్స్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, హెచ్​సీఎల్ టెక్​, బజాజ్ ఫిన్​సర్వ్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

టెక్​ మహీంద్రా, నేస్లే, మారుతీ, సన్​ఫార్మా, ఎం అండ్​ ఎం షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:02 February 02

స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​ సానుకూలతలతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 478 పాయింట్లకు పైగా వృద్ధి చెందింది. 59,341 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 139 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం 17,700 వద్ద కదలాడుతోంది.

బీఎస్​ఈ సెన్సెక్స్​ 580 పాయింట్లు లాభపడి.. 59,456 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరో సూచీ నిఫ్టీ 170 పాయింట్లు వృద్ధి చెంది 17,747 వద్ద ట్రేడవుతోంది.

బజాజ్ ఫైనాన్స్​, కోటక్​ మహీంద్రా బ్యాంక్​, పవర్ గ్రిడ్​ వంటి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

టెక్​ మహీంద్రా, సన్​ఫార్మా, టాటా స్టీల్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Feb 2, 2022, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details