స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ముడి చమురు ధరలు పెరగడం, దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం వంటి కారణాల మదుపర్లను ప్రభావితం చేశాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 656 పాయింట్లు కోల్పోయి 60,099కి పడిపోయింది. నిఫ్టీ 175 పాయింట్ల నష్టంతో 17,938 వద్ద స్థిరపడింది.
Stock Market: మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్ 656 పాయింట్లు పతనం - స్టాక్ మార్కెట్

16:03 January 19
11:48 January 19
భారీ నష్టాల్లో మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు కూడా నేడు ప్రతికూలంగా కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి.
దీనికి తోడు అమెరికాలో 10 ఏళ్ల బాండ్ల రాబడులు రెండేళ్ల గరిష్ఠానికి చేరాయి. మరోవైపు చమురు ధరలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరాయి. ఈ ప్రతికూల పరిణామాలతో భారీ నష్టాల వైపు సూచీలు అడుగులు వేస్తున్నాయి.
మరోవైపు మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ సానుకూలంగా ఉండడం, ప్రీ-బడ్జెట్ ఆశలు.. నష్టాల్ని కట్టడి చేసే అవకాశం కూడా ఉంది.
ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 435 పాయింట్లు కోల్పోయి 60,310 వద్ద కొనసాగుతుంది. మరో సూచీ నిఫ్టీ 125 పాయింట్లు నష్టంతో 17,987 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాలు ఇలా..
టాటా స్టీల్, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనీలివర్ విప్రో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
08:45 January 19
స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్
Stock market live updates: స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్‌ను నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతల నేపథ్యంలో సెన్సెక్స్ 474 పాయింట్లు నష్టపోయి 60,339కి చేరింది. నిఫ్టీ 134 పాయింట్ల పతనంతో 17,978 వద్ద ట్రేడవుతోంది.
ముప్పై షేర్ల ఇండెక్స్‌లో బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ మినహా.. మిగతా అన్నీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.