తెలంగాణ

telangana

ETV Bharat / business

stock market: ఒడుదొడుకుల సెషన్​- చివరకు స్వల్ప లాభాలు - స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్​

stock market live updates
stock market live updates

By

Published : Jan 7, 2022, 9:38 AM IST

Updated : Jan 7, 2022, 4:25 PM IST

16:23 January 07

మార్కెట్లకు లాభాలు..

ఆసియా మార్కెట్లలో మిశ్రమ పరిస్థితులున్నా.. దేశీయ స్టాక్​ మార్కెట్లు వారాంతంలో లాభాలు నమోదుచేశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 143 పాయింట్లు పెరిగింది. చివరకు 59 వేల 745 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో.. 17 వేల 813 వద్ద సెషన్​ను ముగించింది.

14:45 January 07

ఫ్లాట్​గా ట్రేడింగ్​..

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వారాంతంలో ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైనా.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్​ 20 పాయింట్ల లాభంతో 59 వేల 600 ఎగువన కొనసాగుతోంది.

నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 17 వేల 770 వద్ద ట్రేడవుతోంది.

11:23 January 07

దేశీయ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా లాభంతో.. 59,946 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 100 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 17,852 వద్ద కదలాడుతోంది.​

వారాంతపు సెషన్‌లో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి.

08:47 January 07

స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్​డేట్​

stock market live updates: అంతర్జాతీయంగా మిశ్రమ పవనాలతో స్టాక్​ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా లాభంతో మళ్లీ 60వేల మార్కును అందుకుంది. నిఫ్టీ 114 పాయింట్లు లాభపడి 17,857 వద్ద ట్రేడవుతోంది.

  • ముప్పై షేర్ల సూచీలో డాక్టర్​ రెడ్డీస్​, హెచ్​డీఎఫ్​సీ, సన్​ఫార్మా, భారతీయ ఎయిర్​టెల్,​ మారుతీ, ఇన్​ఫోసిస్​ మినహా మిగిలిన షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.
Last Updated : Jan 7, 2022, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details