తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock Market Live: వారాంతంలో లాభాల్లో ముగిసిన సూచీలు

Stock Market Live
Stock Market Live

By

Published : Dec 31, 2021, 9:27 AM IST

Updated : Dec 31, 2021, 3:46 PM IST

15:41 December 31

ఈ ఏడాది ఆఖరు రోజు స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 460 పాయింట్లు పెరిగి.. 58,254 వద్ద స్థిరపడింది. మరో సూచీ జాతీయ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి.. 17,354 వద్ద ముగిసింది.

12:45 December 31

ఈ ఏడాది ఆఖరు రోజు బుల్ జోరు కొనసాగిస్తోంది. అన్ని రంగాల షేర్లు రాణిస్తుండటంతో స్టాక్​మార్కెట్​ సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 500 పాయింట్లకుపైగా పెరిగి.. 58,347 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో.. 17,386 వద్ద కొనసాగుతోంది.

ముప్పై షేర్ల ఇండెక్స్​లో ఎన్​టీపీసీ, టెక్​మహీంద్రా, పవర్​గ్రిడ్​, ఇన్ఫోసిస్, డాక్టర్​ రెడ్డీస్​​ షేర్లు మినహా మిగిలినవి లాభాల్లో ట్రేడవుతున్నాయి.

11:02 December 31

వారాంతంలో స్టాక్​ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 400 పాయింట్లకుపైగా లాభపడి.. 58,216 వద్ద కొనసాగుతోంది. మరో సూచీ ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి.. 17,342 వద్ద ట్రేడవుతోంది.

అన్ని రంగాల షేర్లు దాదాపు రాణిస్తున్నాయి. దీంతో 2021లో ఆఖరు రోజు సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి.

09:10 December 31

స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్​డేట్​

దేశీయ సూచీలు ఈ ఏడాది చివరి సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 300 పాయింట్లకుపైగా లాభంతో.. 58 వేల మార్కును దాటింది. మరో సూచీ నిఫ్టీ 100 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 17,306 వద్ద కొనసాగుతోంది.

  • టైటాన్​, యాక్సిస్​బ్యాంకు, కొటక్​బ్యాంకు, భారతీఎయిర్​టెల్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, టాటాస్టీల్ షేర్లు​ ప్రధానంగా లాభాల్లో కొనసాగుతున్నాయి.
  • ఎన్​టీపీసీ, టెక్​మహీంద్రా, డాక్టర్​రెడ్డీస్​, విప్రో, ఇండస్​ఇండ్​బ్యాంకు షేర్లు ఎక్కువగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Dec 31, 2021, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details