ఒడుదొడుకుల ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 12 పాయింట్లు తగ్గి.. 57,794 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ- నిఫ్టీ 10 పాయింట్ల అతిస్వల్ప నష్టంతో.. 17,204 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.
Stock Market Live: ఆసాంతం ఊగిసలాట- ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు - షేర్ మార్కెట్ అప్డేట్స్
![Stock Market Live: ఆసాంతం ఊగిసలాట- ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు Stock Market Live Updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14046999-thumbnail-3x2-stocks.jpg)
15:41 December 30
12:38 December 30
సూచీల ఊగిసలాట..
స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఫలితంగా దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా పుంజుకుని.. 57,940 వద్ద కదలాడుతోంది. మరో సూచీ నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 17,242 వద్ద ట్రేడవుతోంది.
ఐటీ షేర్లు రాణిస్తుండగా.. ఆటో, లోహా ప్రభుత్వ రంగ బ్యాంకుల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
దేశంలో కొవిడ్, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి.
10:32 December 30
స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. ఐటీ, ఫార్మా షేర్లు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 57,977 వద్ద కదలాడుతోంది. మరో సూచీ నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 17,253 వద్ద ట్రేడవుతోంది.
09:14 December 30
స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో.. 57,839 వద్ద కదలాడుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 5 పాయింట్లు వృద్ధి చెంది.. 17,218 వద్ద కొనసాగుతోంది.
- విప్రో, టెక్‌మహీంద్రా, టాటాస్టీల్, భారతీఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్‌టెక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
- బజాజ్ఫిన్సెర్వ్, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐబ్యాంకు, కొటక్బ్యాంకు షేర్లు ఎక్కువగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.