స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాలు, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండటం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. వీటితో పాటు ఆటో, రియాల్టీ, బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడితో డీలా పడ్డాయి. ఫలితంగా సూచీలు నేల చూపులు చూస్తున్నాయి.
బీఎస్ఈ-సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా కోల్పోయింది. ప్రస్తుతం 57,254 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ 198 పాయింట్లు పతనమై.. 17,050 వద్ద కదలాడుతోంది.
- సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, హెసీఎల్టెక్, టీసీఎస్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ మినహా మిగిలినవి నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.