నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు- సెన్సెక్స్ 100 మైనస్ - stock market news latest
09:05 November 16
స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్
స్టాక్‌మార్కెట్లు మంగళవారం సెషన్‌ను స్వల్ప లాభాలతో ప్రారంభించినప్పటికీ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 126 పాయింట్లు కోల్పోయి 60,592కి చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 18,076 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుంతోంది.
లార్సెన్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
హిండాల్కో,హెచ్డీఎఫ్సీ, ఏసియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి