ఒడుదొడుకుల మధ్య జరిగిన ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ- సెన్సెక్స్ 80 పాయింట్లు కోల్పోయి.. 60,352.82 స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 18,017 వద్దకు చేరింది.
ఒడుదొడుకుల మధ్య నష్టాలతో ముగిసిన సూచీలు
15:42 November 10
14:02 November 10
దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభ నష్టాల నుంచి క్రమంగా పుంజుకున్నాయి. సూచీలు ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 60,434 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 18 వేల ఎగువన కొనసాగుతోంది.
11:44 November 10
స్టాక్ మార్కెట్లు స్థిరంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా నష్టంతో.. 60,173 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి.. 17,968 వద్ద కదలాడుతోంది.
ఆసియా మార్కెట్లు ఒక శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి.
- ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఐటీసీ, టెక్ మహీంద్రా షేర్లు రాణిస్తున్నాయి.
- టాటాస్టీల్, ఇండస్‌బ్యాంకు, ఏషియన్‌పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెడీఎఫ్సీ జంట, కోటక్‌బ్యాంకు షేర్లు ప్రధానంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
పెద్ద షేర్లకు అమ్మకాల ఒత్తిడి
హెచ్‌డీఎఫ్‌సీ జంట, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు వంటి పెద్ద షేర్ల అమ్మకాల ఒత్తిడితో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో దేశీయ సూచీలు కుంగాయి.
ఫలితంగా బుధవారం సెషన్ ప్రారంభ దశలో సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా కోల్పోయి.. 60 వేల దిగువ కదలాడిన సూచీ.. తిరిగి కాస్త పుంజుకుంది.
09:03 November 10
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో స్టాక్ మార్కెట్లు (Stock market live) బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా కోల్పోయి 60,056 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 100 పాయింట్లకుపైగా నష్టంతో.. 17,931 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ ఎం, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ మినహా మిగిలినవి నష్టాల్లో ట్రేడవుతున్నాయి.