వారాంతంలోనూ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమ్మకాల ఒత్తిడితో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు చివరకు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 678 పాయింట్లు కోల్పోయి.. 59,307 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 186 పాయింట్ల నష్టపోయి 17,672 వద్ద ముగిసింది.
కుదేలైన స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 678 పాయింట్లు పతనం - నిఫ్టీ
15:42 October 29
14:50 October 29
స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్సీ-సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా కోల్పోయి 59,507 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ.. 126 పాయింట్లకుపైగా కోల్పోయి.. 17,731 వద్ద కొనసాగుతోంది.
12:09 October 29
స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఐటీ, ఫార్మా, లోహ, స్థిరాస్థి రంగాల షేర్ల కొనుగోళ్లుతో పుంజుకున్న సూచీలు.. తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్సీ-సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా నష్టంతో 59,780 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ.. 50 పాయింట్లకుపైగా కోల్పోయి.. 17,805 వద్ద ట్రేడవుతోంది.
10:21 October 29
భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకున్నాయి. ఐటీ, ఫార్మా, లోహ, స్థిరాస్థి రంగాల షేర్ల కోనుగోలుతో తేరుకున్నాయి. అయినప్పటికీ ఒడుదొడుకులతో సూచీలు ఫ్లాటుగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు కోల్పోయి.. 59,974 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 17,853 వద్ద కొనసాగుతోంది.
09:01 October 29
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వారాంతం సెషన్‌ను స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా ప్రతికూల ప్రభావంతో సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా కోల్పోయి 59,335కి చేరింది. నిఫ్టీ 150 పాయింట్లకుపైగా నష్టపోయి 17,701 వద్ద ట్రేడవుతోంది.
- టాటాస్టీల్, ఏసియన్ పెయింట్స్, టీసీఎస్, బజాబ్ ఆటో ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
- బజాజ్‌ఫిన్ సెర్వ్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఇండస్‌బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ ఎక్కువ నష్టాల్లో కొనసాగుతున్నాయి.