అంతర్జాతీయ ప్రతికూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్లో లాభాలతో ప్రారంభమై 50 వేల ఎగువకు వెళ్లిన సూచీలు.. క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 68 పాయింట్లు లాభంతో 49,970 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ.. 4 పాయింట్ల నష్టంతో 15,025 వద్ద కొనసాగుతోంది.