తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరో రోజూ అవే నష్టాలు- 46,300 దిగువకు సెన్సెక్స్ - స్టాక్​ మార్కెట్​ లైవ్​

stocks live updates
కోలుకుంటున్న స్టాక్​ మార్కెట్లు

By

Published : Jan 29, 2021, 9:30 AM IST

Updated : Jan 29, 2021, 3:44 PM IST

15:41 January 29

13,650 దిగువకు నిఫ్టీ..

స్టాక్​ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ భారీ నష్టాలతో ముగిశాయి. వారాంతపు సెషన్​లో సెన్సెక్స్ 588 పాయింట్లు తగ్గి 46,285 వద్దకు చేరింది. నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 13,634 వద్ద స్థిరపడింది.  

  • ఇండస్​ఇండ్ బ్యాంక్, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో లాభాలను నమోదు చేశాయి.
  • డాక్టర్​ రెడ్డీస్, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్​టెల్, ఎన్​టీపీసీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన.. షాంఘై, టోక్యో సియోల్, హాంకాంగ్ సూచీలూ శుక్రవారం భారీ​​ నష్టాలను నమోదు చేశాయి

14:27 January 29

చివరి గంటలో లాభాల్లోకి..

స్టాక్ మార్కెట్లు సెషన్ చివరి గంటలో నష్టాల నుంచి తేరుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 140 పాయింట్లు పెరిగి.. 47,012 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా వృద్ధితో 13,847 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్, ఫార్మా షేర్లు భారీగా పుంజుకోవడం లాభాలకు కారణంగా తెలుస్తోంది.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • ఎన్​టీపీసీ, ఎం&ఎం, పవర్​గ్రిడ్​, టెక్ మహీంద్రా, ఓఎన్​జీసీ, హెచ్​యూఎల్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

10:34 January 29

వారాంతం సెషన్​ను భారీ లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్​ 50 పాయింట్లకు పైగా కోల్పోయి 46,818కి చేరింది. నిఫ్టీ 6 పాయింట్లు తగ్గి 13,811 వద్ద ట్రేడవుతోంది.

08:59 January 29

భారీ లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

గురువారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్​మార్కెట్లు నేడు లాభాల్లో దూసుకుపోతున్నాయి.    

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 356 పాయింట్ల లాభంతో 47,231 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ.. 99 పాయింట్లు మెరుగుపడి.. 13 వేల 916 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది.

Last Updated : Jan 29, 2021, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details