తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక ప్యాకేజీపై ప్రకటనతో లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

By

Published : Mar 24, 2020, 9:21 AM IST

Updated : Mar 24, 2020, 4:07 PM IST

STOCK MARKET LIVE UPDATES
భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

16:05 March 24

నిర్మలా సీతారామన్​ ప్రకటనతో లాభాలు..

స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు నేడు బ్రేక్​ పడింది. కరోనా నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని తట్టుకునేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు పలు ఉద్దీపనలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ బలపడి కొనుగోళ్లపై దృష్టి సారించారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 693 పాయింట్లు బలపడి.. 26,674 వద్దకు చేరింది. ఇంట్రాడేలో ఈ సూచీ 27,463 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 25,639 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 191 పాయింట్ల వృద్ధితో 7,801కి చేరింది. ఇంట్రాడేలో ఈ సూచీ 8,037 పాయింట్లు గరిష్ఠాన్ని, 7,511 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇన్ఫోసిస్​, బజాజ్ ఫినాన్స్, మారుతీ, హెచ్​యూఎల్​, హెచ్​సీఎల్​ టెక్​, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఎం&ఎం, ఇండస్​ ఇండ్ బ్యాంక్​, ఐటీసీ, పవర్​గ్రిడ్​, ఎల్​&టీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

14:53 March 24

పన్ను రిటర్నుల దాఖలుకు గడువు పెంపు..

ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జూన్ 30వరకు గడువు పెంచింది కేంద్రం. ప్రభుత్వమే గడువు పెంచుతున్నందున పన్ను మొత్తంపై 10 శాతం వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.  కరోనాపై పోరాడేందుకు త్వరలో ఆర్థిక ప్యాకేజీ తీసుకోస్తామన్నారు. అదే సమయంలో ఆధార్, పాన్ కార్డుల అనుసంధానికి ఇంతకుముందున్న మార్చి 31 ఆఖరు తేదిని కూడా జూన్ 30కి పెంచుతున్నట్లు చెప్పారు. ఆదాయపన్ను చట్టం కింద తీసుకోవాల్సిన పలు నిర్ణయాలను కూడా పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

14:34 March 24

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 1330 పాయింట్లకు పైగా లాభపడి 27, 318 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 380 పాయింట్లకు పైగా  వృద్ధి చెంది 7993 గా ట్రేడవుతోంది.

14:29 March 24

అతి త్వరలో ఆర్థిక ప్యాకేజీ..

కరోనా వైరస్​పై పోరాడేందుకు అతిత్వరలో ఆర్థిక ప్యాకేజీ తీసుకురానున్నట్లు ప్రకటించారు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్. పన్ను రిటర్నులు సమర్పించేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగిస్తున్నట్లు  చెప్పారు.  

13:00 March 24

ఆర్థిక ప్యాకేజీ ఆశలు...

స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్​ తర్వాత భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ చేసిన ఈ ప్రకటనతో మదుపరులు కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా సూచీలు భారీగా పుంజుకుంటున్నాయి.

సెన్సెక్స్ 847 పాయింట్లు బలపడి 26,828 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 233 పాయింట్ల లాభంతో 7,843 వద్ద ట్రేడవుతోంది.

బజాజ్​ ఫినాన్స్, ఇన్ఫోసిస్​, హెచ్​యూఎల్​, సన్​ఫార్మా, హీరో మోటోకార్ప్, మారుతీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఐటీసీ, ఎల్&టీ, యాక్సిస్​, ఎం&ఎం, పవర్​ గ్రిడ్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

12:01 March 24

లాభాల్లో సూచీలు..

స్టాక్ మార్కెట్లు నేడు కాస్త సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఉద్దీపన ప్యాకేజీలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోందన్న వార్తలతో మదుపరుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఫలితంగా కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నారు.

సెన్సెక్స్ 515 పాయింట్లు బలపడి ప్రస్తుతం 26,498 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 178 పాయింట్లు పుంజుకుని 7,788 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

ఇన్ఫోసిస్​, హెచ్​యూఎల్​, సన్​ఫార్మా, హెచ్​సీఎల్​ టెక్​, నెస్లే ఇండియా, రిలయన్స్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

బజాజ్ ఆటో, ఐటీసీ, టైటాన్​, యాక్సిస్​ బ్యాంక్, ఎం&ఎం షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

11:22 March 24

సానుకూలంగా స్టాక్ మార్కెట్లు..

స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. 530 పాయింట్లకు పైగా లాభంతో బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 26,518 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ సూచీ నిఫ్టీ 150 పాయింట్లకు పైగా వృద్ధి చెంది 7761 పాయింట్లుగా ట్రేడవుతోంది.

10:51 March 24

లాభాల్లో మార్కెట్లు..

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా వృద్ధి చెంది 26, 284 గా ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ సూచీ నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 7650 గా కొనసాగుతోంది.

10:11 March 24

ఫెడ్ కీలక నిర్ణయాలు- ఒడుదొడుకుల్లో స్టాక్ సూచీలు

అమెరికా కేంద్రీయ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ బాండ్ల కొనుగోళ్లపై నియంత్రణను ఎత్తివేసిన నేపథ్యంలో మార్కెట్ ప్రారంభంలో సానుకూలంగా కదలాడాయి స్టాక్ మార్కెట్ సూచీలు. అయితే ప్రస్తుతం ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 20 పాయింట్లకు పైగా నష్టంతో 26,097 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ సూచీ నిఫ్టీ 20 పాయింట్లకు పైగా క్షీణించి 7584గా కొనసాగుతోంది.  

09:51 March 24

ఒడుదొడుకుల్లో కొనసాగుతున్న మార్కెట్లు..

నేటి ట్రేడింగ్  ప్రారంభంలో భారీ నష్టాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఒకానొక దశలో 1300 పాయింట్ల వద్ద కదలాడిన బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 193 పాయింట్లు పైగా లాభంతో 26, 174 వద్ద ట్రేడవుతోంది. బీఎస్​ఈ సూచీ నిఫ్టీ 58 పాయింట్లకు పైగా వృద్ధితో 7668 గా కొనసాగుతోంది.

09:31 March 24

లాభాల్లో సూచీలు..

అమెరికా కేంద్రీయ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి. నేడు మార్కెట్ ప్రారంభ ట్రేడింగ్​లో ఒకానొక దశలో 1400 పాయింట్లను తాకిన సెన్సెక్స్ ప్రస్తుతం 397 పాయింట్లకు పైగా లాభంతో 26, 378 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 165 పాయింట్లకు పైగా వృద్ధి చెంది 7770 పాయింట్లకు పైగా కదలాడుతోంది. సెన్సెక్స్​లోని షేర్లలో ఐటీసీ, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ వంటి 8 సంస్థల షేర్లు మినహా మిగతావన్నీ లాభాల్లోనే కొనసాగుతున్నాయి.

08:49 March 24

ఫెడ్ ఉద్దీపనలతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు

  • భారీ లాభాలతో ఆరంభమైన స్టాక్‌మార్కెట్లు
  • 1200 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్
  • 300 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ
Last Updated : Mar 24, 2020, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details