Stock Market Close: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుస నష్టాలు నమోదుచేస్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 233 పాయింట్లు కోల్పోయి.. 57 వేల 362 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 70 పాయింట్లు తగ్గి 17 వేల 153 వద్ద సెషన్‌ను ముగించింది. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు కుదేలయ్యాయి. రియాల్టీ రంగం ఒక శాతం మేర పెరిగింది. ఆసియా మార్కెట్లలో బలహీన సంకేతాలతో.. దేశీయ సూచీలు ప్రతికూలంగానే ట్రేడయ్యాయి. హెవీవెయిట్ షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీలో నష్టాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి.
వరుసగా మూడో రోజూ మార్కెట్లకు నష్టాలు
16:51 March 25
13:03 March 25
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకుంటున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 330 పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం 250 పాయింట్ల నష్టంతో.. 57,338 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ షేర్లలో.. రిలయన్స్, కోటక్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. టైటాన్ షేరు భారీగా పడిపోయింది. మరోవైపు, నిఫ్టీ 82 పాయింట్లు పతనమై17,140 వద్ద కదలాడుతోంది.
10:14 March 25
ఫ్లాట్‌గా సూచీలు...
స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు గురవుతున్నాయి. తొలుత లాభాలతో ప్రారంభమైన సూచీలు.. క్రమంగా నష్టాల్లోకి మళ్లాయి. అనంతరం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 136 పాయింట్లు నష్టంతో ట్రేడవుతోంది. ప్రస్తుతం 57,459 వద్ద కదలాడుతోంది.
రిలయన్స్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ మినహా షేరన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. టైటాన్ షేరు అత్యధికంగా డీలా పడింది.
అటు నిఫ్టీ సైతం నష్టాల్లో ఉంది. 41 పాయింట్లు పతనమై.. 17,181 వద్ద కదలాడుతోంది.
09:08 March 25
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 191 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం 57,787 వద్ద కొనసాగుతోంది.
అటు, నిఫ్టీ సైతం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం 29 పాయింట్ల వృద్ధితో 17251వద్ద ట్రేడవుతోంది.