ఆర్బీఐ ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 460 పాయింట్లు లాభపడింది. చివరకు 58,926 వద్ద స్థిరపడింది.
అటు, 90 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ.. 17,554 వద్ద ముగిసింది.
15:33 February 10
ఆర్బీఐ ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 460 పాయింట్లు లాభపడింది. చివరకు 58,926 వద్ద స్థిరపడింది.
అటు, 90 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ.. 17,554 వద్ద ముగిసింది.
11:52 February 10
మార్కెట్ల జోరు..
కీలక రెపో, రివర్స్ రెపో రేట్లు యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యంలో.. దేశీయ స్టాక్ మార్కెట్ల భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు పెరిగి.. 58 వేల 965 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో.. 17 వేల 600 ఎగువన ట్రేడవుతోంది.
రియాల్టీ, విద్యుత్తు, లోహ, బ్యాంకింగ్ రంగం షేర్లు రాణిస్తున్నాయి.
లాభనష్టాల్లో..
హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్ లాభాల్లో ఉన్నాయి.
బీపీసీఎల్, ఐఓసీ, శ్రీ సిమెంట్స్, మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ డీలాపడ్డాయి.
10:44 February 10
ఆర్బీఐ ప్రకటనతో జోష్- మార్కెట్లకు లాభాలు..
రెపో రేట్లు యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యంలో.. దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి.
సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా పెరిగింది. నిఫ్టీ 120 పాయింట్ల లాభంతో 17 వేల 580 ఎగువన కొనసాగుతోంది.
09:23 February 10
ఒడుదొడుకుల్లో సూచీలు..
ఆరంభంలో 350 పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభమైన సూచీలు.. కాసేపటికే ఒడుదొడుకులకు లోనయ్యాయి.
ప్రస్తుతం ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
09:02 February 10
ఆర్బీఐ ప్రకటనకు ముందు.. ఒడుదొడుకుల్లో మార్కెట్లు
Stock Market Live Updates:స్టాక్ మార్కెట్లు ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్ష నిర్ణయాలకు ముందు లాభాల్లో ప్రారంభమయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 190 పాయింట్లు పెరిగి 58 వేల 660 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 52 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం 17 వేల 517 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లో ఇవే..
ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభపడ్డాయి.
బీపీసీఎల్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ డీలాపడ్డాయి.
ఇవీ చూడండి:ఎన్నికల తర్వాత ధరల మోతే- వంట నూనెలు, పెట్రోల్ పైపైకి!