రెండురోజుల లాభాలకు బ్రేకులు వేస్తూ బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 291 పాయింట్లు కోల్పోయి 49,903 వద్ద సెషన్‌ను ముగించింది. మరో సూచీ నిఫ్టీ 78 పాయింట్ల నష్టంతో 15,030 వద్ద స్థిరపడింది. ఫార్మా, ఐటీ రంగాల షేర్ల విక్రయాలతో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.
కరోనా భయాలే మార్కెట్ల నష్టాలకు ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషించారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,279 పాయింట్ల అత్యధిక స్థాయిని, 49,831 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.