స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 152 పాయింట్లు పెరిగి 54,555వద్ద స్థిరపడింది. నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 16,280 వద్దకు చేరింది.
మార్కెట్లు లాభాలతో ముగియటం వరుసగా ఇది రెండో సెషన్. టెలికాం, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. విద్యుత్, లోహ షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.
- భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎం&ఎం లాభాలను గడించాయి.
- టాటా స్టీల్, ఐటీసీ, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో నష్టాలను నమోదు చేశాయి.