తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాల్లో మార్కెట్లు.. సెన్సెక్స్ 370 ప్లస్ - బీఎస్​ఈ సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. సెన్సెక్స్ 380 పాయింట్లు పెరిగి 60,665 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 148 పాయింట్లకుపైగా పుంజుకుంది.

stocks
స్టాక్ మార్కెట్లు

By

Published : Oct 13, 2021, 12:22 PM IST

గత సెషన్​లో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన స్టాక్​ మార్కెట్లు బుధవారం(stock market news today) సెషన్​లోనూ అదేజోరు కొనసాగిస్తున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​(bse sensex today) 371కి పాయింట్లకు పైగా లాభంతో 60,656వేల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145కు పైగా పాయింట్లు వృద్ధి చెంది(nifty today) 18,137 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో మదుపరులు భారీగా కొనుగోళ్లకు దిగుతున్నందువల్లే సుచీలు లాభాల్లో పయనిస్తున్నాయని నిపుణులు విశ్లేషించారు.

బీఎస్​ఈలోని 30 షేర్ల ఇండెక్స్​లో మారుతీ, హెచ్​యూఎల్, ఎస్​బీఐ, నెస్లే, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియాలోని ఇతర మార్కెట్లు షాంఘై, నిక్కీ(జపాన్) నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details