తెలంగాణ

telangana

ETV Bharat / business

44,550పైకి సెన్సెక్స్- సన్​ఫార్మా 4 శాతం జంప్ - స్టాక్​ మార్కెట్​ తాజా వార్తలు

LIVE UPDATES
లాభాల్లో మార్కెట్లు

By

Published : Dec 1, 2020, 9:40 AM IST

Updated : Dec 1, 2020, 11:27 AM IST

11:17 December 01

నిఫ్టీ 110 ప్లస్​

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ దాదాపు 420 పాయింట్లు బలపడి 44,567 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లకుపైగా పెరిగి 13,081 వద్ద కొనసాగుతోంది.

ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. నవంబర్​లో వాహన విక్రయాలు సానుకూలంగా నమోదైనట్లు తెలుస్తున్న నేపథ్యంలో ఆటో షేర్లూ లాభాల్లో ఉన్నాయి.

  • సన్​ఫార్మా (4.3 శాతం)  ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఓఎన్​జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:14 December 01

లాభాల్లో మార్కెట్లు.. 13 వేలకు ఎగువన నిఫ్టీ

లాభాల్లో మార్కెట్లు..

దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 168 పాయింట్ల లాభంతో 44,318 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

నిఫ్టీ 48 పాయింట్లు మెరుగై 13,017 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

లాభనష్టాల్లో..  

గెయిల్​, శ్రీసిమెంట్,ఇండస్​ఇండ్​ బ్యాంక్, డీహెచ్​ఎఫ్​ఎల్, యస్ ​బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.  

కోటక్​ బ్యాంక్, ఎమ్​అండ్​ఎమ్, ఓఎన్​జీసీ, విప్రో షేర్లు వెనకబడ్డాయి. 

Last Updated : Dec 1, 2020, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details