తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లు డీలా.. స్తబ్దుగా కదులుతున్న సూచీలు - స్టాక్ మార్కెట్ వార్తలు

STOCK MARKET LIVE UPDATES
STOCK MARKET LIVE UPDATES

By

Published : Nov 15, 2021, 9:21 AM IST

Updated : Nov 15, 2021, 11:59 AM IST

11:46 November 15

దూకుడుగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు.. డీలా పడ్డాయి. ఆరంభ లాభాలను కోల్పోయిన సెన్సెక్స్.. ప్రస్తుతం ఒడుదొడుకుల మధ్య ట్రేడింగ్ సాగిస్తోంది. 8 పాయింట్ల లాభంతో 60,695 పాయింట్ల వద్ద కదలాడుతోంది. 

అటు, నిఫ్టీ సైతం స్తబ్దుగానే ట్రేడవుతోంది. 4 పాయింట్ల వృద్ధితో.. 18,098 వద్ద కొనసాగుతోంది.

09:06 November 15

స్టాక్ మార్కెట్ లైవ్ అప్​డేట్స్

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 340 పాయింట్లకు పైగా వృద్ధితో 60,963వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్​లోని 30 షేర్లలో రిలయన్స్, భారతీ ఎయిర్​టెల్, మహీంద్ర అండ్ మహీంద్ర మినహా అన్నీ లాభాల్లోనే ఉన్నాయి.  

మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాలతోనే ట్రేడింగ్ ఆరంభించింది. 85 పాయింట్లు వృద్ధి చెంది.. 18,188 వద్ద కొనసాగుతోంది.

Last Updated : Nov 15, 2021, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details