తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock market: ఒడుదొడుకుల్లో స్టాక్​ మార్కెట్లు - స్టాక్ మార్కెట్లో లాభాలు ఎలా వస్తాయి?

STOCKS LIVE
STOCKS LIVE

By

Published : Sep 9, 2021, 9:41 AM IST

Updated : Sep 9, 2021, 1:48 PM IST

13:25 September 09

ఆర్థిక షేర్లు డీలా

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 10 పాయింట్ల నష్టంతో.. 58,240 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 10 పాయింట్లు తగ్గి.. 17,340 వద్ద ట్రేడవుతోంది.

కొన్ని వారాలుగా మార్కెట్లు రికార్డు స్థాయిలో పుంజుకున్నప్పటీకీ లాభాల స్వీకరణతో ఆర్థిక షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురై సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు. 

  • యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
  • నెస్లే, భారతీ ఎయిర్​టెల్​, ఐటీసీ, హెచ్​సీఎల్ టెక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

09:18 September 09

ఒడుదొడుకుల్లో మార్కెట్లు..

స్టాక్ మార్కెట్లు (Stock market today) గురువారం ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్(BSE sensex) 70 పాయింట్లకుపైగా కోల్పోయి 58,180 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్​ఈ-నిఫ్టీ 24 పాయింట్లకుపైగా నష్టంతో 17,329 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు నేపథ్యంలో సూచీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.

  • భారతీ ఎయిర్​టెల్​, కోటక్ బ్యాంక్, ఎస్​బీఐ, బజాజ్ ఫిన్​సర్వ్, నెస్లే షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • టెక్​ఎం​, ఎం అండ్ ఎం​, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టైటాన్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Last Updated : Sep 9, 2021, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details