నష్టాల్లో నుంచి స్టాక్ మార్కెట్లు స్వల్పంగా తేరుకున్నాయి. సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో 52,920 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 15,865 వద్ద ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ఐటీ, ఫార్మా షేర్లు పుంజుకోవడం స్టాక్‌మార్కెట్‌కు కలిసివచ్చింది.
Stock market Live: ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు
14:10 March 08
11:54 March 08
స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. 401 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 52,441 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ135 పాయింట్ల నష్టానికి 15727 వద్ద ట్రేడవుతోంది.
గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న చమురు ధర స్థిరంగా కొనసాగుతోంది. నష్టాల నేపథ్యంలో మదుపర్లు.. ఆటోమొబైల్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ రంగాల షేర్లను విక్రయిస్తున్నారు. మరోవైపు ఐటీ, ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.
లాభనష్టాల్లో..
టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, సిప్లా లాభాల్లో ఉన్నాయి.
ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ నష్టపోయాయి.
10:43 March 08
స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య ట్రేడవుతున్నాయి. కోలుకున్నట్లే కనిపించిన సూచీలు మళ్లీ నష్టాల బాటపట్టాయి. సెన్సెక్స్ 155 పాయింట్లు కోల్పోయి 52,687 వద్ద కొసాగుతుండగా.. నిఫ్టీ 53 పాయింట్ల నష్టానికి 15,809 వద్ద ట్రేడవుతోంది.
10:11 March 08
లాభాల్లో ఇన్ఫీ, అదానీ పోర్ట్స్
ఒడుదొడుకుల మధ్య ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 130 పాయింట్లు లాభపడి 52,974 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 15,890 వద్ద ట్రేడవుతోంది.
ఎన్టీపీసీ, టీసీఎస్, టెక్ఎం, ఇన్ఫీ, అదానీ పోర్ట్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
హిందాల్ కో, టాటా స్టీల్, ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
08:57 March 08
Stock market Live: నష్టాల్లో సూచీలు
Stock Market: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగడం, అంతర్జాతీయంగా ప్రతికూలతల నేపథ్యంలో.. మంగళవారం కూడా దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 107 పాయింట్ల నష్టంతో 52,735 వద్ద ట్రేడవుతోంది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 48 పాయింట్లు కోల్పోయి 15,814 వద్ద కొనసాగుతోంది.
సోమవారం రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన మూడో విడత చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం కూడా మార్కెట్లు ఒడుదొడుకులకు కారణం.