ఫ్లాట్‌గా...
కరోనా ప్రభావంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం సహా కీలక నిర్ణయాలతో ముందుకొచ్చినప్పటికీ... వృద్ధిరేటు తగ్గుతుందనే భయాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 131 పాయింట్ల మేర నష్టపోయి 29,815 వద్ద ముగిసింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 18 పాయింట్ల వృద్ధితో 8,660 వద్ద స్థిరపడింది.
కేంద్రం ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ఉద్దీపన పథకం అండతో గురువారం లాభాల్లో ముగిసిన సెన్సెక్స్.. శుక్రవారం నష్టాలతో ముగిసింది. సామాన్యుడికి ఊరట కల్పిస్తూ ఆర్‌బీఐ ప్రకటించిన కొన్ని నిర్ణయాలు మదుపరులను మెప్పించలేకపోయాయి. రేట్ల కోత, మార్కెట్‌లోకి రూ.3.74 లక్షల కోట్లు చొప్పించేందుకు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు వారిని మెప్పించినా.. కొవిడ్-19 కారణంగా వృద్ధి రేటు అంచనాలను తగ్గించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఒకానొక దశలో ట్రేడింగ్‌లో సుమారు 1700 పాయింట్ల లాభాల్లోకి వెళ్లిన సెన్సెక్స్ చివరికి నష్టాలతో ముగిసింది.
లాభాల్లో...
నిఫ్టీలో కోల్ ఇండియా, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాలు చవిచూశాయి.
రూపాయి...
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.75.27గా ఉంది.