తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్​బీఐ ప్రకటనతో జోష్​- సెన్సెక్స్ 986 పాయింట్లు వృద్ధి - బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ

sensex live
సెన్సెక్స్ నిఫ్టీ

By

Published : Apr 17, 2020, 9:20 AM IST

Updated : Apr 17, 2020, 3:40 PM IST

15:39 April 17

స్టాక్​ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 986 పాయింట్లు పెరిగి 31,589 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 274 పాయింట్ల లాభంతో 9,267 వద్ద ముగిసింది.

కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా రిజర్వు బ్యాంకు ప్రకటించిన ఉద్దీపన చర్యలు మదుపర్లలో భరోసా నింపడం నేటి లాభాలకు ప్రధాన కారణం.

14:20 April 17

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా రిజర్వు బ్యాంకు ప్రకటించిన ఉద్దీపన చర్యలు మదుపర్లలో ఉత్సాహం నింపాయి. ఫలితంగా స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా లాభంతో 31 వేల 240 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 190 పాయింట్ల వృద్ధితో 9 వేల 185 వద్ద కొనసాగుతోంది.

09:17 April 17

ఆర్​బీఐ ప్రకటనపై ఆశలు- సెన్సెక్స్ 1000 ప్లస్

రిజర్వు బ్యాంకు గవర్నర్​ ప్రెస్​మీట్​కు ముందు స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. కరోనా సంక్షోభంతో స్తంభించిన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా శక్తికాంత దాస్ మరిన్ని ఉద్దీపన చర్యలు ప్రకటిస్తారన్న ఆశల నడుమ మదుపర్లు పెద్దఎత్తున కొనుగోళ్లు జరుపుతున్నారు.

సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా ఎగబాకి 31,660 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 275 పాయింట్ల లాభంతో 9,270 వద్ద కొనసాగుతోంది.

Last Updated : Apr 17, 2020, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details