బుల్ జోరు..
దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ గేరు మార్చింది. అన్ని రంగాల షేర్లు రాణించడంతో సూచీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఐటీ, ఆటో, బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, స్థిరాస్తి రంగాల షేర్లు 1 నుంచి 3 శాతం పెరిగాయి. బీఎస్సీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం పైకి వృద్ధి చెందాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండటం.. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 18 మెరుగై రూ.74.91 వద్ద ప్రారంభమవడం సానుకూల అంశాలు. దీంతో పాటు దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీ తగ్గడం వల్ల.. షేర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
మరోవైపు ఫ్యాషన్ సంస్థ గోకలర్స్.. స్టాక్ మార్కెట్లలోకి ఘనంగా అడుగుపెట్టింది. ఈ సంస్థ షేర్లు 91 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ స్టార్ హెల్త్ ఐపీఓ మంగళవారం సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. ఈ అనుకూల పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 889 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 58,150 వద్ద కదలాడుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 260 పాయింట్ల లాభంతో.. 17,314 వద్ద ట్రేడవుతోంది.