తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock Market: లాభాల్లో స్టాక్​ మార్కెట్లు​- సెన్సెక్స్​ 400 ప్లస్​ - బీఎస్ఈ సెన్సెక్స్

Stock markets live
స్టాక్ మార్కెట్లు లైవ్​

By

Published : Nov 29, 2021, 9:37 AM IST

Updated : Nov 29, 2021, 1:28 PM IST

13:20 November 29

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 400 పాయింట్లకుపైగా లాభంతో.. 57,512 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty today) దాదాపు 100 పాయింట్లు వృద్ధి చెంది 17,126 వద్ద కదలాడుతోంది.

హెచ్​సీఎల్​టెక్​, రిలయన్స్​, టీసీఎస్​, బజాజ్​జంట,కొటక్​బ్యాంకు, టెక్​మహీంద్రా, టాటాస్టీల్​ షేర్లు ఎక్కువగా లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ, ఐటీసీ, యాక్సిస్​బ్యాంకు, నెస్లే, ఇండస్​ఇండ్​బ్యాంకు షేర్లు ప్రధానంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:34 November 29

లాభాల్లో మార్కెట్లు

కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ భయాలతో భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు.. క్రమంగా పుంజుకుని లాభాల బాటపట్టాయి. ఓ దశలో 500 పాయింట్లు కోల్పోయి ఆ తర్వాత తేరుకున్నాయి. ఐటీ, లోహ రంగాల షేర్ల దన్నుతో సూచీలు దూసుకుపోతున్నాయి.

బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 400 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 57,605 వద్ద కదలాడుతోంది. మరో సూచీ నిఫ్టీ (Nifty today) దాదాపు 117 పాయింట్లు పెరిగి 17,144 వద్ద ట్రేడవుతోంది.

రిలయన్స్‌ టారిఫ్‌లు పెంచడం, ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ఆర్‌బీఐ సానుకూల ప్రతిపాదనలు, ముడి చమురు ధరలు తగ్గడం, వివిధ దేశాల కరెన్సీలు కోలుకోవడం వంటి పరిణామాలు సూచీలకు కలిసొచ్చాయి.

09:17 November 29

స్టాక్ మార్కెట్లు లైవ్​

స్టాక్ మార్కెట్లు (Stocks today) సోమవారం సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, కరోనా కొత్త వేరియంట్​ భయాలతో సూచీలు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 100 పాయింట్లకుపైగా లాభంతో.. 57,227 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 7 పాయింట్లు పెరిగి 17,033 వద్ద కొనసాగుతోంది.

రిలయన్స్​, డాక్టర్ రెడ్డీస్​, ఇండస్​ఇండ్​బ్యాంకు, భారతీ ఎయిర్​టెల్​, బజాజ్​ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.

బజాజ్​ ఆటో, ఎన్​టీపీసీ, టెక్​మహీంద్రా, ఎస్​బీఐఎన్​, టాటాస్టీల్​, హెచ్​డీఎఫ్​సీ, అల్ట్రాటెక్​సిమెంట్​, హిందుస్థాన్​ యూనిలివర్​, ఏషియన్ పెయింట్​ షేర్లు ఎక్కువగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

మార్కెట్లను వెంటాడుతున్న ఒమిక్రాన్ భయాలు

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. దేశీయంగా కొన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ.. ఒమిక్రాన్‌ భయాలే పైచేయి సాధిస్తున్నాయి.

రిలయన్స్‌ టారిఫ్‌లు పెంచడం, ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ఆర్‌బీఐ సానుకూల ప్రతిపాదనలు, ముడి చమురు ధరలు తగ్గడం, వివిధ దేశాల కరెన్సీలు కోలుకోవడం వంటి పరిణామాలు సూచీలకు కలిసొస్తాయని భావించినప్పటికీ.. అవేవీ ప్రభావం చూపడం లేదు.

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొవిడ్‌ కొత్త వేరియంట్‌ (B.1.1.529).. క్రమంగా విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దేశీయంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. కొన్ని దేశాలు విదేశీ ప్రయాణాలపై ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఈ పరిణామాలతో సూచీల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి.

Last Updated : Nov 29, 2021, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details