దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 230 పాయింట్లు లాభపడి 52,574 ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 15,746 వద్ద స్థిరపడింది.
ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమంగా పుంజుకుని లాభాల బాట పట్టాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు సహా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు సూచీలు పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. ఆటో, ఐటీ మినహా ఇతర కీలక రంగాలు కోలుకోవడం మార్కెట్‌ను లాభాలబాట పట్టేలా చేశాయి. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లను కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఆసక్తి కనబరిచారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 52,629 పాయింట్ల అత్యధిక స్థాయిని.. 51,740 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.