స్టాక్ మార్కెట్లు అనిశ్చితి మధ్య కదలాడుతున్నాయి. కార్పొరేట్ సంస్థల ఆశాజనక క్యూ3 ఫలితాలు మార్కెట్లో జోష్ నింపుతున్నా... ముడి చమురు ధర 86డాలర్ల పైకి చేరడం, బాండ్లపై రాబడి పెరగడం వంటి అంశాలు మదుపరుల ఆందోళనలకు కారణమవుతున్నాయి.
ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. ఊగిసలాట మధ్య ట్రేడింగ్ సాగిస్తోంది. ప్రస్తుతం 29 పాయింట్ల లాభంతో.. 61,252 వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ.. 22 పాయింట్లు వృద్ధి చెంది 18,277 వద్ద కదలాడుతోంది.
సెన్సెక్స్ 30 షేర్లలో.. మారుతీ సుజుకీ, ఎస్బీఐ, టీసీఎస్ లాభాల్లో ఉన్నాయి. హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.