తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 488 ప్లస్​ - షేర్ మార్కెట్ న్యూస్​

Stocks Live
స్టాక్ మార్కెట్లు లైవ్​

By

Published : Oct 7, 2021, 9:27 AM IST

Updated : Oct 7, 2021, 3:49 PM IST

15:44 October 07

స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 488 పాయింట్లు పెరిగి 59,678 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 144 పాయింట్ల లాభంతో 17,790 వద్దకు చేరింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

  • టైటాన్​, ఎం&ఎం, మారుతీ సుజుకీ, ఇండస్​ఇండ్ బ్యాంక్​, ఏషియన్​ పెయింట్స్​ లాభాలను గడించాయి.
  • డాక్టర్​ రెడ్డీస్​, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫిన్​సర్వ్​, హెచ్​యూఎల్​, నెస్లే ఇండియా, నష్టాలను మూటగట్టుకున్నాయి.

12:22 October 07

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 650 పాయింట్లకుపైగా పెరిగి.. 59,840 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 190 పాయింట్లకుపైగా లాభంతో.. 17,830 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

టైటాన్​ షేర్లు రికార్డు స్థాయిలో దాదాపు 10 శాతం పుంజుకున్నాయి. దీనితో కంపెనీ షేరు విలువ జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ క్యాపిటల్​ రూ.2 లక్షల కోట్లు దాటింది.

  • ఎం&ఎం, మారుతీ, ఏషియన్​ పెయింట్స్​, ఇండస్​ ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • డాక్టర్​ రెడ్డీస్​, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్​యూఎల్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:09 October 07

STOCK MARKET LIVE UPDATES

సెన్సెక్స్​ 30

స్టాక్ మార్కెట్లు (Stocks today) గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 520 పాయింట్లకుపైగా లాభంతో 59,710 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 150 పాయింట్లు పెరిగి 17,792 వద్ద కొనసాగుతోంది. దీనితో బుధవారం సెషన్​ నష్టాల నుంచి పూర్తిగా తేరుకున్నాయి సూచీలు.

అన్ని రంగాలు లాభాల్లోనే ఉన్నాయి. 30 షేర్ల ఇండెక్స్​లోని అన్నిషేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

టైటాన్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్​సీఎల్​టెక్​ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

Last Updated : Oct 7, 2021, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details