స్టాక్ మార్కెట్లు (Stock market today) క్రమంగా కోలుకుంటున్నాయి. నాలుగు సెషన్ల పతనం అనంతరం.. వరుసగా రెండో రోజు లాభాలను నమోదుచేశాయి. ఆటో, లోహ, రియల్టీ రంగం షేర్లు(Stocks in news) రాణించడం.. మార్కెట్ల (Stock market news) లాభాలకు కారణం. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ (Sensex today India) సెన్సెక్స్ 383 పాయింట్లు పెరిగి.. 61 వేల 350 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 143 పాయింట్ల లాభంతో 18 వేల 268 వద్ద సెషన్‌ను(Stock market news) ముగించింది.
ఇంట్రాడేలో ఇలా..
మంగళవారం.. సెన్సెక్స్ (Markets today) 600 పాయింట్ల మేర కదలాడింది. ఆరంభంలో 400 పాయింట్లకుపైగా పెరిగినప్పటికీ.. మిడ్ సెషన్లో అమ్మకాల ఒత్తిడి (Stock market live) కారణంగా నష్టాల్లోకి జారుకుంది. 60 వేల 791 పాయింట్ల కనిష్ఠానికి చేరినా.. తిరిగి గట్టిగా పుంజుకుంది. ఒక దశలో 500 పాయింట్లకు పైగా పెరిగింది.