భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ఒమిక్రాన్ భయాలను బేఖాతరు చేస్తూ వరుసగా రెండో రోజూ భారీ లాభాల్లో ముగిశాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు ఉన్నప్పటికీ కీలక రంగాలు రాణించాయి.
సెన్సెక్స్ 776 పాయింట్ల లాభంతో 58, 461 పాయింట్ల వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 234 పాయింట్లు లాభపడి 17,401 పాయింట్ల వద్ద ముగిసింది.
లాభనష్టాల్లోనివి...
అదానీ పోర్ట్ సుమారు 4.5 శాతం మేర లాభపడింది. హెడ్‌డీఎఫ్‌సీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్లు 4 శాతం, సన్‌ఫార్మా, టాటా స్టీల్‌లు 2.8 శాతం మేర లాభాలు గడించాయి.
ఐసీఐసీ బ్యాంక్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.