తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లపై బేర్ పంజా- కుప్పకూలిన సూచీలు - స్టాక్​ మార్కెట్​ న్యూస్​

Stock Market Live News Updates
స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

By

Published : Feb 11, 2022, 9:27 AM IST

Updated : Feb 11, 2022, 3:39 PM IST

15:36 February 11

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికాలో ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు భయాలతో సూచీలు కుప్పకూలాయి. శుక్రవారం సెషన్​లో సెన్సెక్స్ 771 పాయింట్లు కోల్పోయింది. చివరకు 58,152 వద్ద స్థిరపడింది.

అటు, నిఫ్టీ సైతం భారీగా పతనమైంది. 231 పాయింట్లు నష్టపోయింది. చివరకు 17,374 వద్ద ముగిసింది.

14:59 February 11

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 734 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ప్రస్తుతం 58,190 వద్ద కొనసాగుతోంది.

30 షేర్ల ఇండెక్స్​లో టాటాస్టీల్, ఎన్​టీపీసీ, ఇండస్​ఇండ్ బ్యాంక్ మినహా మిగిలిన షేర్లన్నీ నష్టాల్లోనే ఉన్నాయి.

మరోవైపు, నిఫ్టీ సైతం భారీగానే పతనమైంది. 234 పాయింట్లు నష్టపోయి.. 17,371 వద్ద కదలాడుతోంది.

10:02 February 11

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. అమెరికా రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడగా.. అక్కడి మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం 7.5 శాతం వద్ద 40 ఏళ్ల గరిష్ఠానికి చేరడమే అని నిపుణులు చెప్తున్నారు.

ఈ కారణంగా ఫెడ్​ వడ్డీరేట్ల పెంపు మరింత వేగంగా ఉండే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడ్డాయి. దీంతో విదేశీ సంస్థాగత మదుపరుల సెంటిమెంటు దెబ్బతింది. ఈ పరిణామాలతో దేశీయంగా ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతున్నాయి. డీఐఐల కొనుగోళ్లు సూచీలకు కలిసొస్తున్నాయి. దీంతో నష్టాలు తప్పడం లేదు.

  • బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 973 పాయింట్లకుపైగా నష్టంతో.. 57,952 వద్ద కదలాడుతోంది.
  • జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 289 పాయింట్లు కోల్పోయి.. 17,318 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

ముప్పై షేర్ల ఇండెక్స్​లో మారుతీ మినహా అన్నీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

08:53 February 11

స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

Stock Market Live News Updates: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 600 పాయింట్లకుపైగా నష్టంతో.. 58,308 వద్ద కదలాడుతోంది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 180 పాయింట్లు కోల్పోయి.. 17,421 పాయింట్ల వద్ద ట్రేవడుతోంది.

ముప్పై షేర్ల ఇండెక్స్​లో ఎన్​టీపీసీ మినహా అన్నీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Feb 11, 2022, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details