స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 765 పాయింట్ల నష్టంతో 57,696 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 204 పాయింట్లను కోల్పోయి 17,196 వద్దకు చేరింది.
ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కొంత సేపటికే నష్టాల బాట పట్టాయి. ఏ దశలోనూ సూచీలు కోలుకోలేదు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో మదుపరులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగారు. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఓ దశలో సుమారు 800 పాయింట్లకు పైగా కోల్పోయింది.
30 షేర్ల ఇండెక్స్‌లో ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్ మినహా మిగతా షేర్లు అన్నీ నష్టాల్లో ముగిశాయి.