నెమ్మదించిన ప్రగతి రథాన్ని తిరిగి పరుగులు పెట్టించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం చేపడుతున్న వరుస చర్యలు... మదుపర్ల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో సానుకూల ప్రభావం చూపాయి. కార్పొరేట్ పన్ను, జీఎస్టీ తగ్గింపు నిర్ణయాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో దూసుకెళ్లాయి.
గత సెషన్లో(శుక్రవారం) రికార్డ్ స్థాయిలో 19 వందల 21 పాయింట్లు ఎగబాకిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్... నేడూ అదే జోరు కొనసాగించింది. ఈరోజు 1,075 పాయింట్లు పెరిగి... 39 వేల మార్కును దాటింది. 39 వేల 90 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 329 పాయింట్లు ఎగబాకి 11, 603 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా...
ఉదయం 38 వేల 844 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్... మొదట్లో 38 వేల 674 పాయింట్ల కనిష్ఠస్థాయిని నమోదు చేసింది. తర్వాత లాభాల బాటలో పరుగులు తీసి... 39 వేల 441 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 39,090 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 11వేల 543 వద్ద ప్రారంభమై... 11 వేల 666 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. ఓ దశలో 11 వేల 529 పాయింట్ల కనిష్ఠస్థాయిని నమోదు చేసింది. చివరకు 11,603 వద్ద ముగిసింది.
లాభనష్టాల్లో...