అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 600లకుపైగా పాయింట్ల నష్టంతో ఓ దశలో 49వేల దిగువకు చేరుకుంది సెన్సెక్స్. నిఫ్టీ 180 పాయింట్ల మేర నష్టపోయి కాస్త కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 500 పాయింట్ల నష్టంతో 49,079, వద్ద ట్రేడ్ అవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 170 పాయింట్ల నష్టంతో 14,426 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.